హెవీ మోటార్ వెహికల్ డ్రైవర్లుగా 10 మంది ఎంపిక

నంద్యాల జిల్లాకు సంబంధించి బుధవారం జిల్లా రవాణా అధికారి కార్యాలయం ఛాంబర్లో హెవీ మోటార్ వెహికల్ డ్రైవర్ పోస్టుల ఇంటర్వ్యూలు విజయవంతంగా నిర్వహించినట్లు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారి కే.తులసీదేవి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 14 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 12 మంది ఇంటర్వ్యూకు హాజరయ్యారు. వారిలో 10 మందిని ఎంపికైనట్లు తెలిపాడు.