ఇసుక అక్రమ రవాణా.. నలుగురిపై కేసు నమోదు

ఇసుక అక్రమ రవాణా.. నలుగురిపై కేసు నమోదు

JN: అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులపై కేసు నమోదు అయిన ఘటన పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. చెన్నూరు గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమతి పత్రాలు లేకుండా సమీప వాగు నుంచి ఇష్టానుసారంగా ఇసుకను తలిస్తుండగా పోలీసులు పట్టుకొని ట్రాక్టర్‌లను స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. చర్యలు తీసుకుంటామని తెలిపారు.