ప్రతిపక్షాలకు కేంద్రమంత్రి కీలక విజ్ఞప్తి
అఖిలపక్ష సమావేశం అనంతరం కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ప్రతిపక్షాలకు కీలక విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ సజావుగా పనిచేయడానికి సహకరించాలని కోరారు. ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న SIR ప్రక్రియపై చర్చించేందుకు కేంద్రం అనుకూలంగా ఉందని చెప్పారు. అయితే ఏ అంశంపైనైనా చర్చించడానికి ఒక పద్ధతితో పాటు నిబంధనలు ఉంటాయని వాటిని సభ్యులు పాటించాలని సూచించారు.