ప్రభుత్వంపై రోజా కీలక వ్యాఖ్యలు
AP: కూటమి ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి రోజా అన్నారు. 'ప్రజల తిరుగుబాటుకు కోటి సంతకాల సేకరణ నాంది. ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్.. అధికారంలోకి వచ్చాక సూపర్ ఫ్లాప్. CM చంద్రబాబు ఎలా దోచుకుని.. దాచుకుంటున్నారో అందరూ గమనించారు. పేదల కోసం మాజీ CM జగన్ కట్టిన 17 మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రైవేటు పరం చేశారు' అని మండిపడ్డారు.