ఇంటి ముందు పార్క్ చేసిన బైక్‌లే టార్గెట్..!
VSP: విశాఖలో పెట్రోల్ దొంగలు రెచ్చిపోతున్నారు. ఇంటి ముందు పార్క్ చేసిన బైక్‌లనే టార్గెట్‌గా చేసుకొని పెట్రోల్ చోరీ చేస్తున్నారు. ముఖ్యంగా 89వ వార్డు పరిధి కారవేలానగర్ ప్రాంతంలో పది రోజులుగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. రాత్రి పూట బైక్‌ల నుంచి పెట్రోల్ దొంగలిస్తున్న విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.