వరుస దొంగతనాలు.. భయాందోళనలో ప్రజలు..!

వరుస దొంగతనాలు.. భయాందోళనలో ప్రజలు..!

GDWL: గద్వాల పట్టణం వేదనగర్‌లో వరుస దొంగతనాలు ప్రజలను భయపెడుతున్నాయి. శనివారం పట్టపగలు ఓ ఇంట్లో తాళాలు పగలగొట్టి దొంగతనం జరిగిన సంఘటన మరవకముందే సోమవారం అదే ఇంటి పక్కన నివాసముండే తిరుమల బుచ్చయ్య ఇంటికి తాళం పగలగొట్టి దొంగలు మళ్లీ దొంగతనానికి పాల్పడ్డారు. పట్టపగలు ఇళ్లకు తాళం వేసి ఎక్కడికైనా వెళ్లాలంటే వేదనగర్ వీధి ప్రజలు భయపడుతున్నారు.