మిస్సింగ్ కేసును గంటల్లోనే ఛేదించిన పోలీసులు
HYD: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మిస్సింగ్ కేసును గంటల్లోనే సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. ఫిర్యాదు అందిన వెంటనే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన ఆర్జీఐఏ అవుట్ పోస్ట్ పోలీసులు, ప్రయాణికుల కదలికలు, క్యాబ్ వివరాలను పరిశీలించి మిస్సైన మహిళను సురక్షితంగా గుర్తించారు. వేగవంతమైన స్పందనతో కుటుంబానికి ఊరటనిచ్చిన పోలీసుల పనితీరును డీసీపీ రాజేష్ అభినందించారు.