ఆముదాల పల్లిలో వైభవంగా అయ్యప్ప స్వాముల పడిపూజ
ప్రకాశం: పొదిలి మండలంలోని అముదాలపల్లి గ్రామంలో అయ్యప్ప స్వాముల పడిపూజ కార్యక్రమం శుక్రవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో సౌజన్యంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.