'డెకాయిట్' టీజర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్
హీరో అడివి శేష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కాంబినేషన్‌లో డెకాయిట్ మూవీ తెరకెక్కుతుంది. షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం టీజర్‌ను డిసెంబర్ 18న రెండు భాషల్లో, రెండు ముఖ్య నగరాల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా 2026 ఉగాది కానుకగా మార్చి 19న సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.