డ్రైనేజీ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

డ్రైనేజీ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

ప్రకాశం: కనిగిరి మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు సేవా నగర్‌లో జరుగుతున్న డ్రైనేజీ పనులను బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డ్రైనేజీ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.