'అఖండ-2' వీక్షించిన ఎమ్మెల్యే దగ్గుపాటి

'అఖండ-2' వీక్షించిన ఎమ్మెల్యే దగ్గుపాటి

ATP: అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ 'అఖండ-2' సినిమాను అభిమానులతో కలిసి వీక్షించారు. అభిమానుల కోసం శాంతి థియేటర్ (S2)లో ఆయన ప్రత్యేక షో వేయించారు. త్రిశూలం పట్టుకుని అభిమానులతో కలిసి ఎమ్మెల్యే సందడి చేశారు. థియేటర్‌లో 'జై బాలయ్య' నినాదాలు దద్దరిల్లాయి. సినిమా అంచనాలకు మించి ఉందని ఎమ్మెల్యే దగ్గుపాటి తెలిపారు.