VIDEO: 'వెలుగొండ నిర్వాసితులకు రూ.20 లక్షలు ఇవ్వాలి'
ప్రకాశం: మార్కాపురం ప్రెస్ క్లబ్లో ఆదివారం సీపీఎం ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు పాల్గొన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తితో పాటు 11 ముంపు గ్రామాల నిర్వాసితులను ఆదుకోవాలన్నారు. ప్రతి కుటుంబానికి రూ. 20 లక్షలు ఇవ్వాలని, 18 ఏళ్లు నిండిన యువతకు పునరావాస కాలనీల్లో స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.