వైద్య సేవల సమీక్ష నిర్వహించిన కలెక్టర్

వైద్య సేవల సమీక్ష నిర్వహించిన కలెక్టర్

బాపట్ల జిల్లాలో కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ గురువారం వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వైద్య సేవల నాణ్యత, ఆరోగ్య కార్యక్రమాల అమలు, ప్రజలకు అందుబాటులో ఉన్న సౌకర్యాలపై ఆయన వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో DM&HO విజయమ్మ పాల్గొన్నారు.