ప్రజల కోరిక మేరకే పేరు మార్పు: మంత్రి

ప్రజల కోరిక మేరకే పేరు మార్పు: మంత్రి

AP: గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో సీఎం చంద్రబాబు సమగ్ర మార్పులు తీసుకొస్తున్నారని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి పేర్కొన్నారు. ప్రజల కోరిక మేరకే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ పేరు మార్చుతున్నట్లు చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్లు లేకుండా సచివాలయ వ్యవస్థను గత వైసీపీ ప్రభుత్వం అస్తవ్యస్తంగా తయారు చేసిందని విమర్శలు గుప్పించారు.