డివిజన్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి భారీగా దరఖాస్తులు

డివిజన్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి భారీగా దరఖాస్తులు

WGL: GWMC 14వ డివిజన్ పరిధిలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి దరఖాస్తులు స్వీకరించారు. ఈ క్రమంలో ఊహించని విధంగా డివిజన్ అధ్యక్ష పదవికి 33 మంది దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇన్ని దరఖాస్తులు రావడం పట్ల పాత కాంగ్రెస్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో అంతర్గత విభేదాల కారణంగానే ఇన్ని దరఖాస్తులు వచ్చాయని విమర్శలున్నాయి.