VIDEO: జాబ్ మేళలో 87 మంది ఎంపిక

CTR: పుంగనూరు MCV డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా బుధవారం నిర్వహించారు. ఈ మేళలో వివిధ బహుళ జాతీయ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ మధుసుధన్ రెడ్డి జాబ్ మేళాను ప్రారంభించారు. 183 మందిని ఇంటర్వ్యూలు నిర్వహించగా.. వారిలో 87 మందిని ఎంపిక చేసినట్లు నైపుణ్యాభివృద్ధి అధికారి గుణశేఖర్ రెడ్డి తెలిపారు.