సిలిండర్ కోసం డెలివరీ బాయ్‌పై దాడి..!
VSP: విశాఖలో గ్యాస్ సిలిండర్ కోసం డెలివరీ బాయ్‌పై దాడి చేసిన ఘటన లంకెలపాలెంలో జరిగింది. భీమనపల్లి రమణబాబు (50)పై ఇద్దరు ఇనుపరాడ్‌తో దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ముందుగా బుకింగ్ చేస్తేనే సిలిండర్ ఇస్తానని చెప్పడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న దుండగులు ఆటో నుంచి దింపి దాడి చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.