ఉపాధ్యాయుడికి ఘన సన్మాన వీడ్కోలు
KNR: రాయికల్ హైస్కూల్ సోషల్ టీచర్ పేర్చాల భాస్కర్ రావుకు గురువారం ఘనంగా ఉద్యోగ విరమణ అభినందన సభ నిర్వహించారు. 28 ఏళ్ళ సర్వీసు పూర్తిచేసుకున్న ఆయన, పాఠశాల అభివృద్ధి కోసం రూ. 60 వేల విలువైన HD ప్రింటర్, సౌండ్ సిస్టమ్, గ్యాస్ స్టవ్, కార్పెట్లను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంలు అనితారాణి, రమేష్, ఉపాధ్యాయులు నర్సింగం పాల్గొన్నారు.