శివరాత్రి ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
VZM: రామతీర్థంలో శివరాత్రి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి గురువారం పరిశీలించారు. ముందుగా స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు అనంతరం క్యూ లైన్లు, పార్కింగ్ ప్రదేశాలను తనిఖీ చేసారు. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని, శివరాత్రి రోజున దర్శనాలకు ఆటంకం కలగకుండా సాఫీగా జరిగేటట్టు చూడాలని ఆదేశించారు.