చిలకపాలెంలో ఉచిత వైద్య శిబిరం

SKLM: ఎచ్చెర్ల మండలం చిలకపాలెం గ్రామంలో శనివారం స్థానిక కూటమి నాయకుల ఆధ్వర్యంలో శ్రీకాకుళం మెడికవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సాయంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వృద్ధులు వ్యాధిగ్రస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు చిలక రాము కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.