VIDEO: రైలు ఢీకొని మహిళ మృతి

VIDEO: రైలు ఢీకొని మహిళ మృతి

W.G: తాడేపల్లిగూడెం ప్లై ఓవర్ కింద మంగళవారం మధ్యాహ్నం రైలు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. గమనించిన స్థానికులు రైల్వే అధికారులకు సమాచారం అందించారు. ఘటన స్థాలానికి చేరుకున్న రైల్వే ఎస్సై అప్పారావు కేసు నమోదు చేసి, ప్రమాదమా లేక ఆత్మహత్యనా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.