పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
ATP: గుత్తి మార్కెట్ యార్డులో ఇవాళ మార్కెట్ ఛైర్మన్ జక్కలచెరువు ప్రతాప్ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే జయరాం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం క్వింటాకు రూ. 8110 రూపాయలు ధర చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.