రాజీనామా యోచనలో బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేత?

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దేశంలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య ఎలాంటి సఖ్యత కుదరకపోతే ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఆయన రాజీనామా గురించి తమకు సమాచారం వచ్చిందని నేషనల్ సిటిజన్ పార్టీ చీఫ్ నహిద్ ఇస్లామ్ తెలిపారు. ఈ విషయంపై యూనస్‌తో మాట్లాడనున్నట్లు పేర్కొన్నారు.