'అత్యవసర సమయంలో 100కు డయల్ చేయండి'

BHNG: మహిళలు అత్యవసర సమయంలో 100 నెంబర్ కు డయల్ చేయాలని భువనగిరి మహిళా పోలీస్ స్టేషన్ ఎస్సై అర్జునయ్య అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని RTC బస్టాండ్ లో మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. పబ్లిక్ ప్రదేశాలలో అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని, అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.