వీడియో తీశాడని చంపేశారు!

వీడియో తీశాడని చంపేశారు!

తిరుపతిలోని తనపల్లికి చెందిన టి.శ్రీనివాసులు మిస్సింగ్ కేసు హత్యగా తేలింది. మార్చి 28న రైల్వే కాలనీలోని వైన్ షాప్ వద్ద శ్రీనివాసులు తన స్నేహితులతో కలిసి మద్యం తాగాడు. హోంగార్డు మురళి వద్ద గంజాయి ఉండటంతో శ్రీనివాసులు వీడియో తీయడంతో గొడవ మొదలైంది. రంగంపేట రోడ్డులోని పంప్ హౌస్ వద్దకు అతడిని తీసుకెళ్లి బాటిల్‌తో పొడిచి చంపేశారు. నిందితులను అరెస్ట్ చేశారు.