విరాట్ కోహ్లీని ప్రశంసించిన స్టీవ్ స్మిత్
విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవెన్ స్మిత్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఒత్తిడిలో కోహ్లీ పరుగులు ఛేదించే విధానం అసాధారణమని స్మిత్ అభిప్రాయపడ్డాడు. స్మిత్ మాట్లాడుతూ.. "కోహ్లీ 'మోస్ట్ క్లచ్ ప్లేయర్'. ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో అతను పరుగులు ఛేదించే విధానం అద్భుతం. అతని గణాంకాలు ఊహకు అందని విధంగా ఉన్నాయి" అని వ్యాఖ్యానించాడు.