బీచ్ స్నానాలపై పోలీసుల ఆంక్షలు
VSP: కార్తీక మాసం సందర్భంగా విశాఖ బీచ్‌లో స్నానాలపై మెరైన్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ సందర్భంగా మెరైన్ సీఐ రమేష్ మాట్లాడుతూ.. DIG ఆదేశాల మేరకు బీచ్ పరిసర ప్రాంతాలలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులు నిర్ధేశిత ప్రాంతల్లోనే స్నానాలు చేయాలని, సముద్రం లోపలికి వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు. బీచ్ ప్రాంగణంలో గజ ఈతగాళ్లు పహారాకాస్తున్నాట్లు తెలిపారు.