'పమ్మి-అనాసాగరం రోడ్డు మరమ్మతులు చేయాలి'

KMM: పమ్మి నుంచి అనాసాగరం వెళ్లే రోడ్డు మరమ్మతులకు నోచుకోకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై స్పందించిన సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పమ్మి, అనాసాగరం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. సాగర్ కాల్వపై బ్రిడ్జి నిర్మించాలని, దెబ్బతిన్న రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.