'ప్లాస్టిక్ నిషేధం పై వినూత్న ప్రదర్శన'

PPM: నందిగాం మండలం నర్శిపురం జెడ్పీ ఉన్నత పాఠశాల నందు శుక్రవారం సైన్స్ ఉపాధ్యాయులు కె రామకృష్ణ, సీహెచ్ రామారావు ఆద్వర్యంలో సైన్స్ దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా హెచ్ఎం పి.అమ్మనమ్మ సి.వి.రామన్ చిత్రపటానికి పుష్పమాల వేసి నివాళుర్పించారు. ప్రస్తుత సమాజంలో ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ విద్యార్థిచే వినూత్న ప్రదర్శన చేయించారు.