లో ఓల్టేజ్‌తో గ్రామస్తుల ఇబ్బందులు

లో ఓల్టేజ్‌తో గ్రామస్తుల ఇబ్బందులు

కోనసీమ: అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం గ్రామం గుత్తుల వారి పాలెంలో మూడు రోజుల నుంచి విద్యుత్‌లో వోల్టేజ్ సమస్య వేధిస్తుందని స్థానికులు వాపోతున్నారు. ఫ్యాన్‌లు, మంచినీటి మోటార్‌లు కూడా తిరగడం లేదని గురువారం ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి లైన్‌మెన్ లేకపోవడంతో ఈ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు.