VIDEO: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

KMR: మున్సిపల్ పరిధిలోని అడ్లూరులో వరి ధాన్యపు కొనుగోళ్ళను ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని చూపించారు. ధాన్యపు కొనుగోళ్లలో వేగవంతం లేకపోవడం వల్ల అకాల వర్షాలు పడి నష్టపోతున్నామని రైతులు వివరించారు. కొనుగోళ్ళను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు