జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ టాస్క్ ఫోర్స్

HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే మంత్రి తుమ్మల, పొన్నం, వివేక్‌లను ఉపఎన్నిక బాధ్యతలు అప్పగించింది. మంత్రులతో పాటు 18 మంది కార్పొరేషన్ ఛైర్మన్లకు.. ఉపఎన్నికపై సీఎం రేవంత్ బాధ్యతలు అప్పగించారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి పర్యటించాలని ఆదేశించారు. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలన్నారు.