కదిరి నుంచి తిరుమలకు పాదయాత్ర
సత్యసాయి: కందికుంట వెంకటప్రసాద్ గత ఎన్నికల్లో కదిరి టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో మొక్కుబడిని చెల్లించుకునేందుకు తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు కాటం మనోజ్ పాదయాత్ర ప్రారంభించారు. కదిరి శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం నుంచి మనోజ్, కరుణాకర్, రవికుమార్, నవీన్ కుమార్ తదితరులు తిరుమలకు కాలినడకన బయలుదేరారు.