VIDEO: అంబేద్కర్ విగ్రహం తొలగింపు పై ఉద్రిక్తత

VIDEO: అంబేద్కర్ విగ్రహం తొలగింపు పై ఉద్రిక్తత

కరీంనగర్ పరిధి కిసాన్ నగర్లో అంబేడ్కర్ విగ్రహం తొలగింపుపై ఉద్రిక్తత నెలకొంది. కావాలనే కొందరు హైకోర్టులో కేసు వేసి అంబేడ్కర్ విగ్రహాన్ని రాత్రికి రాత్రే మాయం చేశారంటూ కరీంనగర్-పెద్దపల్లి మెయిన్ రోడ్డుపై అంబేడ్కర్ వాదులు బైఠాయించి నిరసన తెలిపారు. నిరసన తెలిపే వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో నిరసనకారులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.