అత్యాచారానికి పాల్పడిన యువకుడిపై పోక్సో నమోదు
MNCL: ఓ బాలిక (15)ను ప్రేమిస్తున్నానని నమ్మించి, అత్యాచారానికి పాల్పడిన చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన స్వామి అనే యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ బన్సీలాల్ మంగళవారం తెలిపారు. యువతిని వివాహం చేసుకుంటానని నమ్మించి మానసికంగా, శారీరకంగా వేధించి ఇంటి నుంచి గెంటివేశాడని చెప్పారు. అతడిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించామన్నారు.