బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత సీరియస్

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. యూసుఫ్‌గూడ సవేరా ఫంక్షన్ హాల్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత నిరసనకు దిగారు. ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లను ఆటోలో ఎక్కిస్తూ హస్తం గుర్తుకు ఓటేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. తనను చంపేస్తారా? అంటూ ఆమె ఆవేదనకు గురయ్యారు.