రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

NLR: ఉలవపాడు మండలం కరేడు ర్యాంపు నుంచి చేవూరు వరకు రూ.2.45 కోట్లతో బీటీ రోడ్డు నిర్మించనున్నారు. సంబంధిత పనులకు కందుకూరు MLA ఇంటూరి నాగేశ్వరరావు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఆనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొత్త రోడ్డు నిర్మాణంతో కరేడు, చేవూరు గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యం అందనుందని. ప్రజల చిరకాల కోరికగా మిగిలిన ఈ రోడ్డును నిర్మించడం తనకు సంతోషంగా ఉందని చెప్పారు.