'జిల్లాకు జాతీయస్థాయి అవార్డు రావడం గర్వకారణం'
భద్రాద్రి జిల్లాకు జాతీయస్థాయి అవార్డు రావడం గర్వకారణం అని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తెలిపారు. జిల్లా కలెక్టర్ జితేష్ వీ. పాటిల్ జాతీయ స్థాయి అవార్డును అందుకున్న సందర్భంగా అశ్వారావుపేట ఎమ్మెల్యే బుధవారం ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. ఎమ్మెల్యే జారే కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు.