అప్పు తీర్చమని అడిగినందుకు హత్య

NDL: జిల్లాలో అప్పు తీర్చమని అడిగిన వ్యక్తిని హత్య చేసిన ఘటన నంద్యాల జిల్లాలో కలకలం రేపింది. బొమ్మలసత్రానికి చెందిన అశోక్ చౌదరి (38) సుబ్బయ్యకు రూ. 40 లక్షలు అప్పు ఇచ్చాడు. ఆ మొత్తాన్ని తీర్చమని ఆదివారం సుబ్బయ్యను అడిగాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. సుబ్బయ్య కుమారుడు మరో వ్యక్తితో కలిసి అశోక్‌ను హత్య చేశాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.