PHCల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి : కలెక్టర్

PHCల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి : కలెక్టర్

NLG: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని న‌ల్ల‌గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి వైద్య సిబ్బందికి సూచించారు. శనివారం కనగల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె త‌నిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్ప‌త్రికి సంబంధించిన పలు రికార్డులను పరిశీలించారు. ఆస్ప‌త్రికి వస్తున్న రోగుల వివరాలు, వారు ఎలాంటి రుగ్మంతలతో వస్తున్నారు అని ఆరా తీశారు.