20న తిరుమలకు రాష్ట్రపతి

20న తిరుమలకు రాష్ట్రపతి

AP: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 రోజుల పర్యటన నిమిత్తం తిరుపతికి రానున్నారు. ఈ నెల 20న మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో తిరుమలకు చేరుకోనున్న ముర్ము.. అదే రోజు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం తిరుమలలో బసచేసి తర్వాతి రోజున శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం ఢిల్లీ తిరుగ పయనమవుతారు.