ఆరిక తోటలో లారీ బీభత్సం

VZM: రామభద్రపురం మండలంలోని ఆరిక తోటలో ఓ లారీ ఆదివారం బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో ఒక బొలెరోతో పాటు ఆటో, నాలుగు ద్విచక్ర వాహనాలను ఏకకాలంలో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. భారీ ఆస్తి నష్టం వాటిలినట్లు బాధితులు వాపోయారు.