రూ.13 కోట్లతో వ్యక్తి పరార్..!
VKB: చిట్టీల పేరుతో ఓ వ్యక్తి పలువురి వద్ద రూ.కోట్లలో వసూలు చేసి పరారయ్యాడు. తాండూరు పట్టణంకు చెందిన గోపాల్ స్థానిక రైల్వేస్టేషన్ మార్గంలో మెడికల్ షాప్‌తో పాటు ఏజెన్సీ నడుపుతున్నాడు. ఆయన వద్ద 100కు పైగా ప్రజలు చిట్టీలు వేశారు. చిట్టి డబ్బులు రూ.13 కోట్ల వరకు వసూలు కాగా కుటుంబంతో సహా పరారయ్యాడు. దీంతో బాధితులు పోలీస్టేషన్‌ను ఆశ్రయించారు.