ఔట్ సోర్సింగ్ JAC మహా జనసభ పోస్టర్ ఆవిష్కరణ
VZM: ఈనెల 8న జిల్లా ఔట్ సోర్సింగ్ JAC ఆధ్వర్యంలో జరిగే మహాజనసభ కార్యక్రమంలో భాగంగా ఆదివారం చీపురుపల్లిలో ఆ ఉద్యోగుల JAC పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తమకు సమాన పనికి సమాన వేతనం, వార్షిక ఇంక్రిమెంట్, ప్రభుత్వ పథకాల అమలు ప్రధాన అజెండాగా ఈ సభను ఏర్పాటు చేసి ప్రభుత్వానికి తమ సమస్యలను తెలియజేస్తామని అధ్యక్షుడు లక్ష్మణరావు తెలిపారు.