కార్యాలయాలను వర్చువల్‌గా ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం
కోనసీమ: రామచంద్రపురం మండలం ద్రాక్షారామంలో డివిజనల్ అభివృద్ధి అధికారి(DDO) కార్యాలయాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని డీడీవో విజయలక్ష్మి బుధవారం తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ డివిజన్‌లో ఈ కార్యక్రమం జరగనుందన్నారు. ప్రజా పరిపాలన మరింత సౌలభ్యం పొందేందుకు ఈ కార్యాలయాలు ఉపయోగపడతాయన్నారు.