కొట్టుకుపోయిన వంతెన.. రాకపోకలకు అంతరాయం

NZB: ధర్పల్లి మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా, దుబ్బాక నుండి రేకులపల్లికి వెళ్లే రహదారిపై ఉన్న వంతెన పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. దీంతో అధికారులు అప్రమత్తమై, వంతెనపై రాకపోకలను నిలిపివేస్తూ హెచ్చరికలు జారీ చేశారు. ప్రమాద నివారణ చర్యగా, పోలీసులు వంతెన వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు.