అమ్మాయిని వేధించాడు.. అరెస్టయ్యాడు

అమ్మాయిని వేధించాడు.. అరెస్టయ్యాడు

ADB: సోషల్ మీడియా ద్వారా బోథ్ పట్టణానికి చెందిన ఒక అమ్మాయిని వేధించిన కేసులో నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తికి చెందిన అలీమ్ బేగ్ అనే వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేసినట్లు SI ప్రవీణ్ కుమార్ తెలిపారు. అతడిని రిమాండ్‌కు తరలించామని పేర్కొన్నారు. నిందితుడిపై రెంజల్ పోలీస్ స్టేషన్‌లో ఇదివరకే నాలుగు కేసులు, రౌడీ షీట్ ఉన్నాయని తెలిపారు.