సత్తెమ్మతల్లిని దర్శించుకున్న భక్తులు

E.G: నిడదవోలు(M) తిమ్మరాజుపాలెంలో కొలువైన శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేసి, తమ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని ఈవో హరి సూర్యప్రకాష్ తెలిపారు. తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.