'కమిషనర్ గారు జర ఇటు చూడండి'

'కమిషనర్ గారు జర ఇటు చూడండి'

NZB: బోధన్ పట్టణంలోని పోలీస్ కాలనీలో చెత్త సమస్య తీవ్రంగా మారింది. చెత్త సేకరణ వాహనం గత కొన్ని రోజులుగా రాకపోవడంతో కాలనీలో ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకుపోయిందని కాలనీవాసులు ఆరోపించారు. దీంతో దుర్గంధం వెదజల్లుతోందని చెప్పారు. మున్సిపల్ అధికారులు స్పందించి పేరుకుపోయిన చెత్తను తొలగించే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.