రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ
ASF: బెజ్జూర్ మండల కేంద్రంలో ఈరోజు బెజ్జూర్ పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రత అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అతివేగం ప్రమాదకరమని, మద్యం తాగి వాహనాలు నడపకూడదని, మైనర్లకు వాహనాలు ఇస్తే వాహన యజమానిపై కేసులు నమోదవుతాయని ఎస్సై సర్తాజ్ పాష తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.